AP DSC ప‌రీక్ష‌కు వయోపరిమితి ఎంతంటే!

3284చూసినవారు
AP DSC ప‌రీక్ష‌కు వయోపరిమితి ఎంతంటే!
AP DSC రాయాలనుకునే జనరల్‌ అభ్యర్థులకు 44 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 49 ఏళ్ల వయోపరిమితి ఉంటుందని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్ తెలిపారు. ఈసారి డీఎస్సీలో ఎంపికైన ఉపాధ్యాయులకు నాలుగు దశల్లో ఇంటర్నేషనల్‌ బాకలారియెట్‌ (ఐబీ), టెక్నాలజీ ట్రైనింగ్, టోఫెల్, బోధన సామర్థ్యంపై శిక్షణ ఉంటుందని చెప్పారు. ఇందులో సర్టిఫికెట్లు సైతం ప్రదానం చేస్తామని వివ‌రించారు.

సంబంధిత పోస్ట్