పులి పంజా ఎట్టా ఉంటుందో.. అట్టా దెబ్బ కొడతాం: సజ్జల (వీడియో)

79చూసినవారు
వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను అక్రమంగా అరెస్టు చేశారని ఆ పార్టీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి మండిపడ్డారు. మంగళవారం గుంటూరు జైలులో నందిగం సురేష్‌ ను పరామర్శించిన తర్వాత సజ్జల మీడియాతో మాట్లాడారు. జైలులో మాజీ ఎంపీకి కనీస సదుపాయాలు కల్పించలేదని అన్నారు. భవిష్యత్తులో 'పులి పంజా ఎట్టా ఉంటుందో.. అట్టా దెబ్బ కొడతాం' అని టీడీపీకి సజ్జల వార్నింగ్ ఇచ్చారు. లేని కేసులు పెట్టడం కూటమి పార్టీ అలవాటుగా చేసుకుందన్నారు.

సంబంధిత పోస్ట్