మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్, విండీస్ మహిళల జట్ల మధ్య మరికాసేపట్లో రెండో వన్డే జరగనుంది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి మ్యాచ్‌లో ఏకంగా 211 పరుగుల భారీ తేడాతో కరీబియన్ జట్టును టీమిండియా చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లోనూ అదే జోరు కొనసాగించి సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తోంది.