టర్కీలో మంగళవారం తెల్లవారుజామున భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. బాలికేసిర్ వాయువ్య ప్రాంతంలోని ఓ ఆయుధ తయారీ కర్మాగారంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంపై తమకు ఎలాంటి అనుమానాలు లేవని ఓ మీడియా సంస్థతో టర్కీ అధికారులు వెల్లడించారు. కాగా, 2014 నుంచి ఈ కర్మాగారంలో తేలికపాటి ఆయుధాలు తయారీ చేస్తారు.