TG: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అల్లు అర్జున్ ప్రధాన వ్యక్తిగత సిబ్బంది, బౌన్సర్ ఆంటోనీని పోలీసులు సోమవారం అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. సంధ్య థియేటర్లో తొక్కిసలాటకు ఇతనే ప్రధాన కారణంగా పోలీసులు భావిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం తెలయాల్సి ఉంది.