సీఎం చంద్రబాబు టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2029 ఎన్నికల్లో గెలిచి మళ్లీ అధికారంలోకి వస్తామని అన్నారు. రాజకీయ కక్షతో జగన్ పెట్టిన తప్పుడు కేసులను చట్టపరంగా పరిష్కరిస్తామని కార్యకర్తలకు హామీ ఇచ్చారు. పని చేసే నాయకులు, కార్యకర్తలకే పార్టీ గుర్తింపు ఇస్తుందన్నారు. వైసీపీ కార్యకర్తలు చేసిన తప్పులే టీడీపీ కార్యకర్తలు చేయొద్దని చంద్రబాబు సూచించారు.