YCP ప్రభుత్వంలో పూర్తి నిర్లక్ష్యానికి గురైన అమరావతికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావడంతో మంచి రోజులు వచ్చాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు 2014-2019 సమయంలో సీఎంగా ఉన్నప్పుడు అమరావతిలో కొన్ని నిర్మాణాలు పూర్తయ్యాయి. కొన్ని పునాది దశలో ఆగిపోయాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో చువ్వలను పూర్తిగా తొలగించిన తర్వాతే నిర్మాణ పనులు ప్రారంభించాల్సి ఉందని ఐఐటీ హైదరాబాద్ నిపుణులు అభిప్రాయపడ్డారు.