తిరుపతి జనసేన ఇన్‌ఛార్జ్ కిరణ్ రాయల్‌పై లక్ష్మి అనే మహిళ తీవ్ర ఆరోపణలు చేశారు. కిరణ్ తన దగ్గర రూ.1.30 కోట్లు అప్పుగా తీసుకొని ఇవ్వడం లేదంటూ బాధితురాలు ఆరోపించారు. తన డబ్బులు తనకు ఇవ్వాలని అడిగితే బెదిరిస్తున్నాడని, డబ్బులు తిరిగి ఇవ్వకుంటే తనకు చావే శరణ్యమని వాపోయారు. పోలీసులు స్పందించి తన డబ్బులు తనకు ఇప్పించాలని లక్ష్మి కోరుతున్నారు.