టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్, అతియా శెట్టి దంపతులు త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ ఇద్దరూ కలిసి తమ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఈ విషయం తెలిపారు. 2025లో తాము బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు ప్రకటించారు. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కూతురు, నటి అతియాను కేఎల్ రాహుల్ 2023 జనవరిలో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.