అనంతపురంలో యువతి దారుణ హత్య

78చూసినవారు
అనంతపురంలో యువతి దారుణ హత్య
అనంతపురం జిల్లాలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆత్మకూరు మండలం వడ్డుపల్లి కాలువ గట్టు సమీపంలో ఓ యువతిని అత్యంత దారుణంగా హతమార్చారు. ఆమె తలపై బండరాళ్లతో కొట్టి చంపారు. అటు వైపు వెళ్లిన గొర్రెల కాపరులు మృతదేహాన్ని చూసి ఆత్మకూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్