అర్ధనారీశ్వర స్వరూపంలో గౌరమ్మ

55చూసినవారు
అర్ధనారీశ్వర స్వరూపంలో గౌరమ్మ
సాంప్రదాయంగా పసుపు గౌరమ్మను చేస్తుంటారు. తంగేడు పూలు పసుపుతనానికి ప్రతీకగా నిలుస్తాయి. ఈ గౌరమ్మను చేయడంలో గొప్ప ఆచారం కనబడుతుంది. అర్ధనారీశ్వరునికి సంకేతంగా బతుకమ్మను నిలుపుకొంటారు. శివపార్వతులు ప్రకృతి– పురుషులు. నిజంగా గౌరమ్మ అనగానే పూలతో ఒక గోపురంలా పేర్చడం ఒకటే కాదు, ఆ గోపురం నడుమ ఒక నొక్కు(గుమ్మడి)ని పెట్టి ఒక పసుపు ముద్దను రెండు గోపురాలుగా రూపొందేటట్లు పూలను పేరుస్తారు. అంటే గౌరమ్మే అర్ధనారీశ్వర స్వరూపం అన్నమాట. ఇందులో ప్రత్యేకంగా గౌరీ ఆరాధన కనిపిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్