సీఎం చంద్రబాబుతో రాజకీయం అంత ఈజీ కాదని రాజకీయ విశ్లేషకుల మాట. అయితే వైఎస్ జగన్.. బాబుని లైట్ తీసుకుంటున్నారా? అన్నది కూడా చర్చ నడుస్తోంది. చంద్రబాబుని పట్టించుకోనవసరం లేదు 175 సీట్లు మనవే అని 11 సీట్లతో సరిపెట్టుకున్నారు. ఇప్పుడు విపక్షంలో ఉన్నా కూడా బాబుని మళ్లీ జనాలు ఎన్నుకోరు అన్న భ్రమలోనే వైసీపీ ఉన్నట్లు తెలుస్తోంది. జగన్‌కి ఇంకా చంద్రబాబు రాజకీయం అర్థం కాలేదేమోనని విశ్లేషకులు అంటున్నారు.