AP: ఎన్టీఆర్ జిల్లాలో గత వారం రోజులుగా 18 మంది మహిళలు, బాలికలు మిస్ అయ్యారు. అయితే వీరందరినీ పోలీసులు క్షేమంగా రక్షించారు. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. మహిళలను, బాలికలను క్షేమంగా వారి కుటుంబ సభ్యుల చెంతకు చేర్చిన పోలీసులను, హోం మంత్రి అనితను, ఎన్టీఆర్ జిల్లా సీపీని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. కూటమి ప్రభుత్వం వల్ల రాష్ట్రంలో మార్పు మొదలైందన్నారు.