ఏపీకి విపత్తుల నిర్వహణ సంస్థ మళ్లీ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. నవంబర్ 21న దక్షిణ అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఇది పశ్చిమ- వాయువ్య దిశగా పయనించి నవంబర్ 23 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఈ నెల 27, 28 తేదీల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.