దేశవ్యాప్తంగా ఉల్లి ధరల పెరుగుదలకు, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు దగ్గరి సంబంధాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. భారత్‌లో ఉల్లి సాగు చేస్తున్న రాష్ట్రాల్లో మహారాష్ట్రది అగ్రస్థానం. ఇక్కడి నుంచి విదేశాలకు లక్షలాది టన్నులు ఎగుమతి అవుతుంటాయి. ఉల్లి ధరల పెరుగుదలకు ఈ ఎగుమతులపై పరిమితులు విధించకపోవడం ఒక కారణమైతే.. తగినంత ఉత్పత్తి లేకపోవడం మరో కారణం. ఎన్నికల నేపథ్యంలోనే విదేశీ ఎగుమతులపై పరిమితులు విధించలేదని తెలుస్తోంది.