వైద్య శాఖలో డాక్టర్ రాంప్రసాద్ కు ఉత్తమ సేవ అవార్డు

61చూసినవారు
వైద్య శాఖలో డాక్టర్ రాంప్రసాద్ కు ఉత్తమ సేవ అవార్డు
వైద్యశాఖలో ఉత్తమ సేవలందించినందుకు గాను బద్వేలు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సి రాంప్రసాద్ కు ఉత్తమ సేవా అవార్డు లభించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ ఉత్తరుల మేరకు కడప డి సి ఎస్ నుంచి అవార్డు తనకు అందినట్లు డాక్టర్ రాంప్రసాద్ తెలిపారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రి స్టాఫ్ నర్స్ పిచ్చమ్మ కు కూడా ఈ సేవా వార్డు లభించినట్లు పేర్కొన్నారు. ఆసుపత్రి సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్