
కడప: వైసీపీ నేతలందరూ MS ధోనిలా దూసుకుపోవాలి: జగన్
YCP జిల్లా అధ్యక్షులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో మాజీ సీఎం జగన్ పార్టీ భవిష్యత్ కార్యక్రమాలు సహా అనేక అంశాలపై నేతలతో చర్చించారు. YCP నేతలందరూ MS ధోనిలా దూసుకుపోవాలని సూచించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని, సమాజంలో గొంతులేని వారికి బాసటగా నిలిచేది వైసీపీయే అని జగన్ పేర్కొన్నారు. ప్రతి సమస్యలోనూ బాధితులకు YCP తోడుగా నిలవాలని ఆ పార్టీ అధినేత సూచించారు.