పైడిపాలెం రిజర్వాయర్ కు 770 క్యూసెక్కుల నీరు

72చూసినవారు
పైడిపాలెం రిజర్వాయర్ కు 770 క్యూసెక్కుల నీరు
కొండాపురం మండలంలో గండికోట ఎత్తిపోతల పథకం నుంచి పైడిపాలెం రిజర్వాయర్ నీటిని తరలిస్తున్నారు. గండికోట ఎత్తిపోతల పథకంలోని మోటర్ల ద్వారా 770 క్యూసెక్కుల నీరు రిజర్వాయర్లోకి వచ్చి చేరుతున్నట్లు అధికారులు తెలిపారు. బుధవారం ఉదయానికి 4. 49 టీఎంసీల నీరు నిల్వ ఉందని, రిజర్వాయర్ పూర్తి కెపాసిటీ 6 టీఎంసీలని పేర్కొన్నారు. రిజర్వాయర్ నుంచి 170 క్యూసెక్కుల నీరు దిగువ వదులుతున్నట్లు అధికారులు వివరించారు.

సంబంధిత పోస్ట్