విజయవాడ వరద బాధితులకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ఎస్టి సెల్ నాయకులు రూ. 1. 50లక్షలు ఆర్థికసాయం చేశారు. ఆ మేరకు బుధవారం వారు సిఎం చంద్రబాబుకు చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎస్టి నాయకులు హనుమంతు నాయక్ మాట్లాడుతూ వరద బాధితులకు తమ సంఘం తరఫున నలుగురం రూ. 1. 50లక్షల చెక్కును అందజేశామన్నారు. రాష్ట్ర ఎస్టి సెల్ అధ్యక్షులు దారు నాయక్ ఇదివరకు రూ. లక్ష ఇవ్వడమే కాక బట్టలను అందజేశారన్నారు.