కమలాపురం నగరంలోని అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాలతో పాటు మండల నగర పంచాయతీ కార్యాలయం పార్టీ కార్యాలయంలో గురువారం కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నో త్యాగాలు ఎన్నో పోరాటాలు చేసిన మహానీయుల త్యాగ ఫలితమే ఈ 78వ స్వతంత్ర వేడుకలు జరుపుకుంటున్నామని ఆయన అన్నారు ప్రతి ఒక్కరు తమ వంతు కృషిగా బాధ్యతలు నిర్వహించాలని తెలిపారు.