కొప్పర్తి పారిశ్రామిక వాడ అభివృద్ధికి లోకేష్ కృషి
కొప్పర్తి పారిశ్రామిక వాడ అభివృద్ధికి మంత్రి నారా లోకేష్ కృషి చేశారని కమలాపురం ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి అన్నారు. గురువారం మంత్రి లోకేష్ జన్మదిన సందర్భంగా కమలాపురం కార్యాలయంలో కేక్ కట్ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కమలాపురం అభివృద్ధి చేస్తానని లోకేష్ తనకు హామీ ఇచ్చినట్లు తెలిపారు. కొప్పర్తిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కింద రూ. 2, 300 కోట్ల నిధులు తీసుకురావడంలో లోకేష్ పాత్ర ఎంతగానో ఉందన్నారు.