తొలిరోజు షూటింగ్‌లోనే హీరోయిన్‌తో ప్రేమలో పడ్డాను: యువ హీరో
యువ హీరో కిరణ్ అబ్బవరం తన మొదటి సినిమా హీరోయిన్ రహస్య గోరఖ్‌ను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 'క' సినిమా ప్రమోషన్ ఈవెంట్ లో తన ప్రేమ వివరాలను వెల్లడించారు. తొలి సినిమా షూటింగ్ మొదటి రోజే రహస్యతో ప్రేమలో పడిపోయానని తెలిపారు. ఈ విషయం తన సన్నిహితులకు కూడా తెలుసు అన్నారు. కావాలనే దీనిని సీక్రెట్ గా ఉంచినట్లు కిరణ్ అబ్బవరం పేర్కొన్నారు.