‘10-3-2-1' ఫార్ములా కంటి నిండా నిద్రించేందుకు చక్కటి పరిష్కారం: నిపుణులు

544చూసినవారు
‘10-3-2-1' ఫార్ములా కంటి నిండా నిద్రించేందుకు చక్కటి పరిష్కారం: నిపుణులు
కంటి నిండా నిద్రపోవాలంటే ‘10-3-2-1' ఫార్ములా పాటించాలని నిపుణులు చెబుతున్నారు. నిద్రపోవడానికి '10' గంటల ముందు కాఫీ, టీ లు తాగకూడదని, వీటిలో ఉండే కెఫీన్ నాడీవ్యవస్థను ప్రేరేపించి సహజ నిద్రకు ఆటంకం కలిగిస్తుందని సూచించారు. అలాగే నిద్రపోవడానికి '3' గంటల ముందు త్వరగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. ఇంటి పని లేదా ఆఫీసు పనిని నిద్రకు '2' గంటల ముందే ఆపేయాలి. నిద్రకు '1' గంట ముందే స్క్రీన్ చూడటం మానుకోవాలని చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్