100 మంది ఒలింపిక్ పతకాలను అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ వెనక్కి తీసుకుంది. 2024లో పారిస్‌లో ఒలింపిక్స్ పోటీలు నిర్వహించగా అందులో విజేతలకు అందజేసిన పతకాలు నాసిరకంగా ఉన్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పతకాలపై ఉన్న లోహపు పూత చెదిరిపోయి అవి దారుణంగా తయారయ్యాయి. దీంతో ఇప్పటికే 100 మంది అథ్లెట్లు వాటిని వాపస్ చేశారు. దీనిపై స్పందించిన అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ త్వరలోనే వాటిని మార్చి ఇస్తామని ప్రకటించింది.