‘మేము సంక్రాంతికి ఊరికి పోతున్నాం.. డబ్బు, నగలూ తీసుకుని వెళ్తున్నాం. మా ఇంటికి రాకండి. -ఇట్లు మీ శ్రేయోభిలాషి’ అంటూ పేపర్‌పై రాసి ఓ ఇంటి యజమాని డోర్‌కు అంటించి మరీ వెళ్లాడు. ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పండగల వేళ నగరాల నుంచి సొంతూళ్లకు పెద్ద సంఖ్యలో ప్రజలు వెళ్తుంటూరు. ఇదే అదనుగా భావించి దొంగలు రెచ్చిపోతుంటారు. ఇలాంటి దొంగలకే షాక్ ఇస్తూ ఓ ఇంటి యజమాని ఈ రకంగా సందేశం పెట్టడం అందరినీ ఆకర్షించింది.