టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న మూవీ 'లైలా'. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్ చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ నెల 17న టీజర్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఓ పోస్టర్‌ను షేర్ చేశారు. ఈ సినిమాలో విశ్వక్ లేడీ గెటప్‌లో కనిపించనున్నాడు. ఆకాంక్ష శర్మ కథానాయికగా నటిస్తోంది. రామ్ నారాయణ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది ఫిబ్రవరి 14న రిలీజ్ కానుంది.