ఒలింపిక్స్ కోసం పారిస్ ఘనంగా ముస్తాబైంది. ఈ క్రమంలో ఒలింపిక్స్‌లో గందరగోళ వాతావరణం సృష్టించేందుకు కుట్రలు జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. నిందితుడిని రష్యాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అనుమానితుడి నివాసంలో తనిఖీలు చేయగా.. ఒలింపిక్స్‌లో అస్థిరత తీసుకొచ్చేలా ప్రణాళికలు రచిస్తున్న ఆధారాలను పోలీసులు గుర్తించారు.