భారత స్టార్ షట్లర్ పీవీ సింధు హ్యాట్రిక్ పతకాలు సాధించాలని కసిగా పారిస్‌కు పయనమైంది. సింధు రియో ఒలింపిక్స్‌లో రజతం, టోక్యోలో కంచు మోత మోగించిన విషయం తెలిసిందే. ఈ సారి మెరుగైన ప్రదర్శనతో స్వర్ణం సాధించి హ్యాట్రిక్ మెడల్స్ అందుకోవాలని బరిలోకి దిగుతోంది. అయితే కామన్వెల్త్ క్రీడల్లో గాయపడిన సింధు పునరాగమనం తర్వాత సత్తాచాటలేకపోతుంది. కానీ పారిస్‌లో తన విశ్వరూపాన్ని చూపించడానికి సింధు సిద్ధంగా ఉంది.