కర్ణాటకలోని అగుంబే అడవికి దగ్గరలో ఆసక్తికర ఘటన జరిగింది. ఒక భారీ కింగ్ కోబ్రా పాము అడవినుంచి బయటకి వచ్చింది. అది రోడ్డుమీద నుంచి పక్కనే ఉన్న ఇంటికి ఆనుకుని ఉన్న చెట్టుమీద ఎక్కి కూర్చుంది. అది దాదాపు.. 12 అడుగులు ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడున్న పాదాచారులు కింగ్ కోబ్రాను గమనించారు. వెంటనే వారు ఇంటి ఓనర్ పాముల్ని పట్టేవారిని పిలిపించి దానిని తీసుకెళ్లేలా ప్లాన్ చేశారు. దీనికి సంబంధించిన వీడీయో వైరల్ అవుతోంది.