191 ఏళ్ల తాబేలు.. ఎక్కడుందంటే?

56చూసినవారు
ప్రపంచంలోనే అతి పురాతమైన జంతువుగా సీషెల్స్ రకం తాబేలు జొనాథన్(191) గిన్నిస్ రికార్డు సాధించింది. సాధారణంగా తాబేళ్లు భూమ్మీద 80-150 ఏళ్లు జీవిస్తాయట. కొన్ని మాత్రం అరుదుగా 200 ఏళ్లకు పైగా జీవించగలవట. ప్రస్తుతం ఈ జొనాథన్ తాబేలు దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రంలోని సెయింట్ హెలానా దీవిలో నివసిస్తోంది. 1832లో జన్మించినట్లుగా భావిస్తున్న ఈ తాబేలు ఇప్పటివరకు ఆరోగ్యంగానే ఉండటం గమనార్హం.