దేశంలోని పేద, మధ్యతరగతి వర్గాల అర్బన్ హౌసింగ్‌కు ఆర్థిక చేయూత అందించేందుకు రూ. 2.2 లక్షల కోట్ల ప్యాకేజీని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఇళ్ల నిర్మాణం కోసం తీసుకునే రుణాలపై వడ్డీ రాయితీని అందిస్తామని పేర్కొన్నారు. మహిళల పేరు మీద కొనే ఆస్తులపై పన్నును తగ్గిస్తామని పేర్కొన్నారు.