ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వక్ఫ్ బోర్డు రద్దు

55చూసినవారు
ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వక్ఫ్ బోర్డు రద్దు
కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీ వక్ఫ్ బోర్డును రద్దు చేసింది. ఈ మేరకు 47 జీవోను ఉపసంహరించింది. త్వరలో కొత్త వక్ఫ్ బోర్డు నియమించేందుకు కసరత్తులు చేస్తు్న్నట్టు ప్రకటించింది. రాష్ట్రంలోని వక్ఫ్ ఆస్తులను కాపాడేందుకు చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా జగన్ ప్రభుత్వంలో వక్ఫ్ బోర్డు ఏర్పాటు అయింది. అయితే వక్ఫ్ బోర్డు ఆస్తుల్లో అవకతవకలు జరిగినట్లు కూటమి ప్రభుత్వం గుర్తించింది. దీంతో బిల్లును రద్దు చేసింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్