AP: కృష్ణా జిల్లా కంకిపాడు జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించిన విషయం తెలిసిందే. మచిలీపట్నం వెళ్తున్న కారు టైరు పేలడంతో డివైడర్‌ను దాటుకుని వెళ్లి చేపల వ్యాన్‌ను డీకొంది. వ్యాను క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ను అతికష్టంమీద పోలీసులు, స్థానికులు బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన అతడిని అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.