పిల్లలకు స్క్రీన్ సమయం గురించి ఇండియన్ పీడియాట్రిక్స్ అకాడమీ పలు సూచనలు చేసింది. 0-2 ఏళ్ల వయసున్న చిన్నారులు ఎట్టి పరిస్థితుల్లోనూ టీవీ, సెల్ ఫోన్, ఐప్యాడ్ తరహా స్క్రీన్లకు అలవాటు కాకూడదని సూచించింది. దీనివల్ల పిల్లలలో వర్చువల్ ఆటిజంతో పాటు మాట ఆలస్యమవడం, ఎదుగుదల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించింది. 2-5 ఏళ్ల పిల్లల స్క్రీన్ టైం గంట దాటకూడదని, ఆపై వయసున్న పిల్లలు చదువు, ఆటలు, ఫ్యామిలీ టైం, నిద్రను బ్యాలెన్స్ చేస్తూ స్క్రీన్ టైం కేటాయించాలని తెలిపింది.