నాసిరకం ఆహారం భుజించడం పోషకాహార లోపానికీ, తద్వారా వివిధ వ్యాధులకూ దారితీస్తోందని అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధనా సంస్థ (IFPRI) తెలిపింది. మెరుగైన ఆహారం తీసుకుంటే ఏటా ప్రతి అయిదు మరణాల్లో ఒకదాన్ని (20%) నివారించవచ్చని గతవారం నేపాల్ రాజధాని కాఠ్‌మాండూల్ విడుదల చేసిన నివేదికలో ఆ సంస్థ వివరించింది. ప్రపంచ జనాభాలో 200 కోట్ల మందిని సూక్ష్మపోషకాల లోపం పీడిస్తోందని తెలిపింది.