ఇన్ఫోసిస్‌లో కొత్తగా 20వేల ఉద్యోగాలు

83చూసినవారు
ఇన్ఫోసిస్‌లో కొత్తగా 20వేల ఉద్యోగాలు
కొత్తగా 20వేలమందికి ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు ఇన్ఫోసిస్ ప్రకటించింది. వరుసగా 6 త్రైమాసికాల్లో ఉద్యోగుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. కానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మాత్రం భారీగా నియామకాల్ని చేపడతామని సంస్థ పేర్కొంది. తాజా పట్టభద్రుల కోసం ఆన్ క్యాంపస్, ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్ నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. ఈ ఏడాది జూన్ త్రైమాసికం చివరి నాటికి సంస్థలో ఉద్యోగుల సంఖ్య 3,15,332గా ఉంది.

సంబంధిత పోస్ట్