ఎండల ధాటికి 20 ద్విచక్ర వాహనాలు దగ్ధం

64చూసినవారు
ఎండల ధాటికి 20 ద్విచక్ర వాహనాలు దగ్ధం
TG: జగిత్యాల పట్టణంలో తీవ్రమైన ఎండల ధాటికి 20 ద్విచక్ర వాహనాలు దగ్ధం అయ్యాయి. బైపాస్ రోడ్ లో గల అన్వేష్ అనే మెకానిక్ ఇంటి ఆవరణలో ఉన్న 20 బైక్ లు ఎండ వేడిని తట్టుకోలేక పూర్తిగా కాలిపోయాయి. ఆ మంటలు కాస్త ఇంట్లోకి వ్యాపించగా ఇంట్లో ఉన్న సామాగ్రి కూడా దగ్ధమైంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో సుమారుగా 10 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితులు వాపోతున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్