ప్రముఖ క్విక్ కామర్స్ సంస్థ జెప్టో (Zepto) సహ వ్యవస్థాపకుడు కైవల్య వోహ్రా అరుదైన ఘనత సాధించాడు. హురూన్ బిలియనీర్ల జాబితాలో చోటుదక్కించుకున్నాడు. దీంతో భారత్‌లోని అత్యంత సంపన్నుల జాబితాలో పిన్న వయస్కుడిగా నిలిచాడు. రూ.3,600 కోట్లతో కైవల్య అగ్రస్థానంలో నిలవగా.. మరో సహ వ్యవస్థాపకుడు 22 ఏళ్ల అదిత్ పాలిచా రెండో స్థానంలో ఉన్నారు. కైవల్య వోహ్రా, ఆదిత్ పాలిచా ఇద్దరూ స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీ విద్యార్థులే.