అమెరికా అధ్యక్షుడు బైడెన్ వైట్‌హౌస్ నుంచి డెలావేర్‌లోని రెహోబోత్ బీచ్‌కి వెళ్లి ఉల్లాసంగా గడిపారు. కుటుంబ సభ్యులతో కలిసి తీరంలో ఇసుక మేటలపై కుర్చీ వేసుకుని హాయిగా గడిపారు. అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్ (81), బైడెన్ ఇద్దరు సోదరీమణులతో కలిసి బీచ్‌లో రెండు గంటల పాటు గడిపారు. మధ్య మధ్యలో సంచిలో నుంచి పేపర్లు తీస్తూ జిల్ బైడెన్‌కు ఇస్తూ కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.