లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా సరికొత్త లుక్‌లో కనిపించారు. ఆయన మార్షల్ ఆర్ట్స్ ట్రిక్స్ నేర్చుకుంటున్న వీడియోను తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో మార్షల్ ఆర్ట్స్ జియు-జిట్సు టెక్నిక్‌ని ఉపయోగించి ప్రత్యర్థి ఆటగాళ్లను ఓడించడం కనిపించింది. రాహుల్ గాంధీ ఈ ప్రత్యేక వీడియో ద్వారా జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.