నమీబియాలో కరువు తాండవం.. వన్యప్రాణులను చంపి ప్రజలకు ఆహారం

82చూసినవారు
నమీబియాలో కరువు తాండవం.. వన్యప్రాణులను చంపి ప్రజలకు ఆహారం
నమీబియాలో గత వందేళ్లలో ఎన్నడూ లేనంత కరవు తాండవిస్తోంది. అక్కడి ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. దీంతో తాజాగా 723 వన్య ప్రాణులను వధించి ఆ మాంసం ప్రజలకు ఆహారంగా పంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ జాబితాలో 83 ఏనుగులు, 30 నీటి గుర్రాలు(హిప్పోలు), 60 అడవి దున్నలు, 50 ఇంఫాలాలు, 100 బ్లూవైల్డ్ బీస్ట్‌లు, 300 బీజ్రాలు ఉన్నాయి. వీటి సంఖ్య అడవుల్లో, ఇతర ప్రాంతాల్లో తగినన్ని ఉండటంతో ఈ నిర్ణయం తీసుకొన్నట్లు పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్