ఉత్తరప్రదేశ్ లోని బరేలీలో తాజాగా షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ హోటల్లో 28 ఏళ్ల యువతిని గొంతు కోసి చంపేశారు. మృతురాలు నగ్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహం దగ్గర బురఖా ఉండటంతో మహిళ ముస్లిం అని భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.