ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా అత్యంత వైభవంగా జరుగుతోంది. మంగళవారం మకర సంక్రాంతి పురస్కరించుకుని వివిధ అఖాడాల నుంచి వేలాదిగా వచ్చిన సాధువులు తొలి పుణ్య స్నానాలు ఆచరించారు. నేడు ఒక్కరోజే దాదాపు 3.5 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమానికి తరలివచ్చినట్లు యూపీ ప్రభుత్వం వెల్లడించింది. కుంభమేళా సమయంలో పుణ్యస్నానాలకు ప్రత్యేక స్థానముంది. పెద్ద సంఖ్యలో వివిధ అఖాడాల నుంచి సాధువులు తరలి వచ్చి సామూహిక స్నానాలు ఆచరిస్తారు.