BHEL 400 ఇంజినీర్ ట్రైనీ, సూపర్ వైజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిలో ఇంజినీర్ పోస్టులు 150 కాగా, మిగతావి సూపర్ వైజర్ ఉద్యోగాలు. బీటెక్, బీఈ పాసై 27 ఏళ్లలోపు వారు అర్హులు. ఎంపికైన వారికి శిక్షణలో రూ.32,000-రూ.50,000 మధ్య, ఆ తర్వాత రూ.33,500-రూ.1,80,000 పే స్కేలులో జీతం ఇస్తారు. ఫిబ్రవరి 28వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలకు వెబ్‌సైట్ https://www.bhel.com/ ను చూడగలరు.