నీట్ రీటెస్ట్‌కు 48 శాతం మంది గైర్హాజరు

54చూసినవారు
నీట్ రీటెస్ట్‌కు 48 శాతం మంది గైర్హాజరు
నీట్ యూజీ-2024 పరీక్ష పత్రం లీకేజీ, పరీక్ష నిర్వహణలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA).. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో గ్రేస్ మార్కులు పొందిన 1,563 మంది విద్యార్థులకు తిరిగి ఆదివారం నీట్ పరీక్ష నిర్వహించింది. వారిలో 48 శాతం మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యారని NTA తెలిపింది. 813 మంది (52 శాతం) పరీక్షకు హాజరైతే, 750 మంది (48 శాతం) గైర్హాజరయ్యారని ఓ ప్రకటనలో పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్