6 గ్యారంటీలు కాదు.. 6 అక్రమ కేసులు: తాటికొండ రాజయ్య

72చూసినవారు
6 గ్యారంటీలు కాదు.. 6 అక్రమ కేసులు: తాటికొండ రాజయ్య
ప్రజల పక్షాన పోరాడే గొంతు ఆపేందుకే KTRపై అక్రమ కేసులు పెడుతున్నారని BRS మాజీ MLA తాటికొండ రాజయ్య మండిపడ్డారు. అడ్డంగా రూ.50 లక్షలతో కెమెరా ముందు దొరికి జైలుకు వెళ్లి వచ్చిన రేవంత్ రెడ్డి, ఎలాగైనా KTRని జైలులో వేయాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. KTRపై అక్రమ కేసులతో BRS పార్టీని భయపెట్టాలనుకుంటే అది రేవంత్ రెడ్డి మూర్ఖత్వమేనన్నారు. తామంతా ఉద్యమంలోనే ఎన్నో ఆటుపోట్లు ఎదురుకొని ప్రత్యేక రాష్ట్రం సాధించిన KCR సైనికులమని చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్