కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం చాలా పథకాలు తెచ్చింది. అందులో పీఎం కుసుమ్ యోజన (PM-KUSUM Scheme) పథకం ఒకటి. దీని ద్వారా రైతులు వ్యవసాయం కోసం సోలార్ వ్యవసాయ పంపులను.. సబ్సిడీ ధరకు పొందవచ్చు. ప్రతీ రైతుకీ కేంద్రం 60% తగ్గింపు ఇస్తుంది. మరో 30 శాతాన్ని లోన్ రూపంలో పొందవచ్చు. ఈ లోన్ కేంద్రమే ఇప్పిస్తుంది. మిగతా 10% మనీ మాత్రం రైతు పెట్టుకోవాలి. ఈ పథకం కోసం https://pmkusum.mnre.gov.in/landing-about.html వెబ్సైట్లో అప్లై చేసుకోవాలి.