భారీ వర్షాలు.. పలు రైళ్లు రద్దైనట్లు ప్రకటించిన SCR

64చూసినవారు
భారీ వర్షాలు.. పలు రైళ్లు రద్దైనట్లు ప్రకటించిన SCR
భారీ వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వేలో కొన్ని రైళ్లు రద్దయ్యాయి. కొన్ని పాక్షికంగా రద్దయ్యాయి. కొన్ని రూట్లను డైవెర్షన్ చేసినట్లు SCR ప్రకటించింది. మహబూబాబాద్ లో కురిసిన భారీ వర్షాలతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇంటికన్నె, కేసముద్రం సమీపంలో రైల్వే ట్రాక్ దెబ్బతినడంతో పలు రైళ్లు వివిధ స్టేషన్ లలో నిలిచిపోయాయి. సికింద్రాబాద్, ఖమ్మం రూట్ లో 30 రైళ్లు ఎఫెక్ట్ అయ్యాయి. వరంగల్ సమీపంలో నిలిచిపోయిన రైళ్లను ఖాజీపేట స్టేషన్ కు డైవెర్ట్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్