జమ్ముకాశ్మీర్‌ తుది విడతలో 65.58 శాతం పోలింగ్‌

79చూసినవారు
జమ్ముకాశ్మీర్‌ తుది విడతలో 65.58 శాతం పోలింగ్‌
మ్ముకాశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో చివరిది అయిన మూడో విడత పోలింగ్‌ మంగళవారం ప్రశాంతంగా ముగిసింది. ఏడు జిల్లాల్లోని 40 స్థానాలకు ఈ పోలింగ్‌ నిర్వహించారు. మంగళవారం సాయంత్రం ఏడు గంటల సమయానికి 65.58 శాతం మంది ఓటింగ్‌ నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు. అత్యధికంగా నాలుగు అసెంబ్లీ స్థానాలున్న ఉధంపుర్‌ రీజియన్‌లో 72.91 శాతం పోలింగ్‌, అత్యల్పంగా బందిపొర రీజియన్‌లో 64.85 శాతం పోలింగ్‌ నమోదైనట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్