ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. అక్కడి గంగా నదిపై ఉన్న వంతెనపై నుండి 8 ఏళ్ల బాలిక అకస్మాత్తుగా నదిలో పడిపోయింది. దీంతో బాలికను కాపాడటానికి తల్లి షాలిని, సోదరుడు నదిలో దూకారు. స్థానికులు రెస్క్యూ బృందానికి సమాచారం అందించడంతో.. వారు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి బాలికను సురక్షితంగా కాపాడారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.